ఉప్పల్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం, వాహనాలు దగ్ధం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ భాగాయత్‌లోని డ్రీమ్ హౌస్ జూపిటర్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, రెండు బైకులు, ఒక సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, షార్ట్‌సర్క్యూట్ లేదా దీపం వల్ల మంటలు అంటుకుని ఉండవచ్చని పోలీసులు తెలిపారు.