విద్యార్థులకు తీపి కబురు: ఐఎస్బీ రజతోత్సవాల సందర్భంగా భారీ స్కాలర్షిప్ల ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

దేశంలో మేనేజ్మెంట్ విద్యను మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రజతోత్సవాల సందర్భంగా పలు నూతన కార్యక్రమాలను ప్రకటించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఏటా రెండు వందల యాభై స్కాలర్షిప్లను అందించేందుకు ఐఎస్బీ ఇరవై ఐదు స్కాలర్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. మేధస్సు, ఆర్థిక అవసరాల ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో వంద శాతం వరకు రాయితీ లభించనున్నట్లు స్పష్టం చేశారు.