సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేసి ఏడారిగా మార్చారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
సింగూరు ప్రాజెక్టు కింద పన్నెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల నిండుగా ఉన్న సింగూరును ఖాళీ చేసి ఏడారిగా మార్చారని మండిపడ్డారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.