పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం పెదవాల్తేరు పరిధిలోని రామ్‌నగర్‌లో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆంధ్ర మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న పెదిరెడ్ల శైలజ(27) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు కిటికీలోనుంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీసి కేజీహెచ్‌కు తరలించగా, మూడో పట్టణ సీఐ ఎల్.అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.