భారత్ తో వన్డే సిరీస్ కు కివీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆక్లాండ్

భారత్ తో జరగనున్న వన్డే సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని కివీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. తొడ కండరాల గాయంతో చాప్మన్, భుజం నొప్పితో రవీంద్ర బాధపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానంలో టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్ తదితరులకు జట్టులో చోటు కల్పించినట్లు బోర్డు పేర్కొంది.