మహిళల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం: నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు జస్టిస్ జేపీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. లైంగిక నేరాలకు పాల్పడే వారి గుండెల్లో భయం పుట్టించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. నేరస్థుల మనసుల్లో చచ్చిపోతామనే భయం పుట్టనంత వరకు ఘోరాలు జరుగుతూనే ఉంటాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాలేజీలు, రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, మహిళల రక్షణ కోసం పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.