ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా షేక్ ఖాదరున్నిస నామినేషన్ దాఖలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా షేక్ ఖాదరున్నిస కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వన్నెం నాగరాజు ఓటర్లను అభ్యర్థించారు.