భగత్ సింగ్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం డిమాండ్
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు సిటీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, ఇంటి పన్నులపై యజమాని పేరు ముద్రించాలని సిపిఎం డిమాండ్ చేసింది. సచివాలయం వద్ద సామూహిక మహాధర్నా నిర్వహించిన నేతలు, కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.