బ్రిక్స్ వేదికగా కొత్త బీమా, ధాన్యం మార్కెట్ ప్రతిపాదించిన పుతిన్

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు బ్రిక్స్ దేశాల మధ్య స్వతంత్ర బీమా వ్యవస్థ, ప్రత్యేక ధాన్యం మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు కలిసి పనిచేయాలని, పాశ్చాత్య ఆంక్షలను ధీటుగా ఎదుర్కొనేందుకు స్వతంత్ర మార్గాలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.