కరీంనగర్ లో డైరీల పోరు: పాల విక్రయాల వివాదంతో ఘర్షణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ నగరంలోని రామ్ నగర్ లో కరీంనగర్ డైరీ పక్కనే సంగం డైరీ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రత్యేక ఆఫర్లతో పాల విక్రయాలు చేపడుతుండటంతో కరీంనగర్ డైరీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన మాటామాటా వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో పాల డబ్బాలను తన్నినట్లు సమాచారం. ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.