'కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి': సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విష ప్రచారం చేశారని, కేసీఆర్‌కు 67 ఎకరాలు మాత్రమే ఉందని అసెంబ్లీ సాక్షిగా సీఎం అంగీకరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు అసత్య ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పుట్టినప్పటి నుంచి తమ కుటుంబ ఆస్తులపై విచారణకు సిద్ధమని, రేవంత్ రెడ్డి ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు.