జీవో ఇరవై ఐదును రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల నిరసన

రిపోర్టర్: కృష్ణ స్థలం: సిద్దిపేట

జీవో ఇరవై ఐదును తక్షణమే రద్దు చేయాలని, ఎఫ్ఎల్ఎన్ పేరిట ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెంచే చర్యలను విరమించుకోవాలని ఎస్జీటీ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొహెడ జడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఉపాధ్యాయుడు ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నాయకులు సత్తయ్య, నారాయణ, రాజిరెడ్డి, రవివర్మ తదితరులు పేర్కొన్నారు.