హైదరాబాద్ మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని మాదాపూర్ సిద్దిఖీ నగర్లోని ఓయో హోటల్లో విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి రూమ్ బుక్ చేసుకున్న ఆమె ముఖం, తలపై గాయాలతో అపస్మారక స్థితికి చేరుకోగా, ఆసుపత్రికి తరలించేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిళ్లు లభించగా, ప్రియుడు పరారీలో ఉన్నాడు.