వానకు సైతం వెరవక హోరెత్తిన గణపతి భక్తి పారవశ్యం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వర్షం కురుస్తున్నప్పటికీ వెనకడుగు వేయకుండా స్థానిక యువకులు ఎంతో ఉత్సాహంతో డప్పు చప్పుళ్ల మధ్య గణపతి విగ్రహాలను ఊరేగింపుగా మండపాల వద్దకు తరలించారు. యువకుల నృత్యాలు, కేరింతలు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై నామస్మరణలతో పట్టణ వీధులన్నీ మారుమోగిపోయాయి. వర్షంలో విగ్రహాలు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మండపాల్లో ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల కోసం మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.