ఈసీ జ్ఞానేశ్ కుమార్ లక్ష్యంగా రాహుల్ గాంధీ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఢిల్లీ
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించి జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జ్ఞానేశ్ కుమార్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల వంతేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.