తీరం దాటనున్న వాయుగుండం వేళ కోస్తాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కృష్ణా జిల్లా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం 08672-252399 నెంబర్ ను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.