వైసీపీకి భారీ షాక్: జనసేన పార్టీలోకి గుంపాం నాయకుల భారీ చేరికలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గుంపాం పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నేత కోట్ల రఘు ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువాలు కప్పుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు స్పష్టం చేశారు.