పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో అధిక వసూళ్ల పర్వం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో భక్తుల నుంచి ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనం కోసం వచ్చే భక్తులను దోచుకోవడమే కాకుండా, వసూళ్లను ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ అక్రమాలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.