ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
రిపోర్టర్: హరి
స్థలం: Vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు.