కల్తీ లేని నాయకుడు అంబేద్కర్ అంటూ హుస్నాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కల్తీ లేని నాయకుడు అంబేద్కర్ అనే అంశంపై ఆదివారం ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో వివిధ బహుజన, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.