'అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం': కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

రిపోర్టర్: శివ స్థలం: India

దేశవ్యాప్తంగా జనన, మరణాల ఆలస్య నమోదుపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నూతన చట్టం ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు పారదర్శకమైన కేంద్రీకృత డాటాబేస్‌ను నిర్వహించనున్నారు.