'పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు': వైసీపీ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్
రిపోర్టర్: హరి
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఐదు నెలల క్రితమే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఆయన, నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణలతో పార్టీ నుంచి వేటు పడటం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.