విజయనగరం కార్పొరేషన్ పోరు హోరాహోరీ: మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల కసరత్తు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం కార్పొరేషన్ మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయ వేడి రాజుకుందని, టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా పోటీపడుతున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెదేపా తరఫున పలువురు నేతలు రేసులో ఉండగా, వైకాపా నుంచి కోలగట్ల శ్రావణి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు ఖరారు కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.