టాటా సన్స్ షేర్ మార్కెట్ లిస్టింగ్‌ను వ్యతిరేకించిన నోయెల్ టాటా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఆ సంస్థ షేర్ మార్కెట్ లిస్టింగ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తన వీటో అధికారంతో దాన్ని అడ్డుకుంటానని ఆయన తేల్చిచెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల నేపథ్యంలో లిస్టింగ్ అవసరమైతే కనీసం మూడేళ్ల గడువు కోరాలని ఆయన సూచించారు. మరోవైపు ఎన్.చంద్రశేఖరన్ పునర్నియామకంపై కూడా టాటా ట్రస్ట్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది.