పండుగ వేళ ఆర్టీసీ చార్జీల పెంపుపై హరీశ్ రావు తీవ్ర నిప్పులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

పండుగ వేళ ఆర్టీసీ టికెట్ ధరలను విపరీతంగా పెంచి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేత్తో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెబుతూనే, మరో చేత్తో పురుషులపై అదనపు భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ టికెట్ ధరను రూ.230 నుంచి ఏకంగా రూ.400కు పెంచడం దారుణమని విమర్శించారు.