స్థానిక ఎన్నికల తప్పుడు ప్రచారంపై సైబర్ పోలీసులకు ఎస్ఈసీ ఫిర్యాదు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ లెటర్ హెడ్, లోగో, సంతకాలను ఫోర్జరీ చేసి వాట్సప్లో తప్పుడు పోస్టులు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఈ నకిలీ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.