భూ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం నేత రాఘవులు డిమాండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న భూ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణ ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్కు 450 ఎకరాలు, సీఎం రేవంత్ రెడ్డికి 350 ఎకరాల భూమి కేటాయించారనే ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ ఉండాలన్నారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతూ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.