ఉపాధ్యాయులపై వైకాపా శ్రేణుల దాడులు అత్యంత దుర్మార్గమన్న పల్లా శ్రీనివాసరావు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఉపాధ్యాయులపై వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. టీచర్లను అవమానించడం, దాడులు చేయడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, వైకాపా నేర సంస్కృతికి అద్దం పడుతోందని ఆక్షేపించారు. గురువులపై దాడిచేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ క్రీడా కోటా టీచర్లపై జరిగిన దాడులను వివిధ ఉపాధ్యాయ, క్రీడా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.