రవాణాపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్గా కూడా రమణమ్మ, వైస్ చైర్మన్గా కూడా కనకమహాలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు వెల్లడించారు. నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.