మురసు తుఫాను హెచ్చరిక: అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసుల స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఎన్టీఆర్
మురసు తుఫాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు స్పష్టం చేశారు. బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున మోటార్ సైకిళ్లపై ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగం సూచనలు పాటించాలని సూచించారు.