తిరుమలలో వసతి సమస్యల పరిష్కారానికి 'నందకం' యాప్‌ రూపకల్పన

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

తిరుమలలో భక్తుల వసతి గదుల్లో సమస్యల తక్షణ పరిష్కారం కోసం తితిదే 'నందకం' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నీటి కొరత, విద్యుత్ అంతరాయం, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించేలా ఏఐ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. త్వరలోనే ఈ సేవలను భక్తులకు కూడా పూర్తిగా అందుబాటులోకి తేనున్నారు.