వంటనూనెల దిగుమతి సుంకాలు తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

రాబోయే దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలపై పడుతున్న నిత్యావసరాల భారానికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంగా దేశంలో వంట నూనెల ధరలు దాదాపు 20 శాతం పెరగడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నుండి అమల్లోకి వచ్చేలా పన్ను కోత విధించింది. ముడి పొద్దుతిరుగుడు నూనెపై పన్నును పూర్తిగా సున్నాకు తీసుకురాగా, సోయాబీన్, పామాయిల్ సుంకాలను కూడా తగ్గించారు.