ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్ లో దక్షిణ కొరియాతో భారత్ పోరు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mohali

ఆసియా క్రీడల విజయంతో దూసుకుపోతున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొట్టింది. గ్రూప్ దశలో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈనెల బుధవారం మోహాలి వేదికగా జరగనున్న సెమీఫైనల్ లో దక్షిణ కొరియాతో తలపడనుందని భారత జట్టు ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల అలసటను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.