తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాల బీభత్సం
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, గెడ్డలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ, అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం మన్యంలో కొండచరియలు విరిగిపడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా, వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రిజర్వాయర్లు నిండుకుండలా మారడంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు.