కర్నూలులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం
రిపోర్టర్: కిరణ్
స్థలం: కర్నూలు
కర్నూలు నగరంలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనోత్సవానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సుమారు రెండు వేలకు పైగా ప్రతిమలు జలప్రవేశం చేయనుండగా, కేసీ కెనాల్‌లో నీటి కొరత నేపథ్యంలో తాత్కాలిక గోడలు నిర్మించి నీటిని పంపింగ్ చేశారు. నిమజ్జన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు.