ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
రిపోర్టర్: హరి
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చేస్తూ పలువురు సీనియర్ అధికారులను బదిలీ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేత తర్వాత కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఐజీగా, విశాల్ గున్నిని ట్రైనింగ్ డీఐజీగా నియమించారు. మార్కాపురం, పల్నాడు, పోలవరం జిల్లాలకు కొత్త ఎస్పీలుగా పంకజ్ కుమార్ మీనా, జగదీశ్ అదహళ్లి, కె. చక్రవర్తిలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.