మహారాష్ట్రలో సంచలనం: సోనాయ్ డెయిరీకి కల్తీ పాలు సరఫరా చేసినట్లు ఎఫ్డీఏ వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: Pune

మహారాష్ట్రలోని సోనాయ్ డెయిరీకి భారీగా కల్తీ పాలు సరఫరా అయినట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ కల్తీ నెట్వర్క్పై దర్యాప్తు జరిపిన ఎఫ్డీఏ అధికారులు, ట్యాంకర్ చలానాల ఆధారంగా సరఫరా గొలుసును గుర్తించారు. నిందితుల నుంచి మహాలక్ష్మి డెయిరీ ద్వారా సోనాయ్ డెయిరీకి కల్తీ పాలు చేరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వేలాది లీటర్ల కల్తీ పాలను అధికారులు ధ్వంసం చేశారు.