అంతర్జాతీయ సంచలనం: ఇరాన్ పై రసాయన ఆయుధాల హెచ్చరికలు అందజేసిన నెతన్యాహు
రిపోర్టర్: రమేష్
స్థలం: Washington
ఇరాన్ రసాయన ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందంటూ అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిఘా సమాచారాన్ని అందించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ హెచ్చరికలపై అమెరికా మరియు గల్ఫ్ దేశాల వర్గాల్ లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను సైనిక చర్యకు ఉసిగొలిపేందుకే ఈ నిఘా సమాచారాన్ని సృష్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు అధికారులు తెలిపారు.