ఆధ్యాత్మిక కాంతులతో మైమరిపించిన హజరత్ ఖాదర్ బాబా జన్మదిన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణంలోని బాబామెట్ట దర్గాలో సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి 130వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దర్గా ధర్మకర్త మొహమ్మద్ ఖలీల్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి చీమలపాడు సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మోహియుద్దీన్ బాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేకంగా చాదర్ సమర్పించి విశ్వశాంతి, లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌తో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు అందుకున్నారు.