కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతానికి రూ.304.44 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే

రిపోర్టర్: శివ స్థలం: కొప్పర్తి

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు రూ.304.44 కోట్ల వ్యయంతో 4-లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి మరింత వేగవంతం కావడంతో పాటు రవాణా సౌకర్యాలు విస్తృతం కానున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.