టెలికాం యూజర్లకు తీపి కబురు: మూడు కొత్త వాయిస్ ప్లాన్లను తెచ్చిన ఎయిర్టెల్
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా మూడు కొత్త వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మొబైల్ డేటా అవసరం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లు, సెకండరీ సిమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.185, రూ.203, రూ.206 ధరలతో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు ఎయిర్టెల్ స్పష్టం చేసింది.