నిర్లక్ష్యంతో మూలనపడ్డ మెరైన్ పోలీస్ బోట్లు!
రిపోర్టర్: వెంకట్
స్థలం: కృష్ణా
మచిలీపట్నం గిలకలదిండి మెరైన్ పోలీసు స్టేషన్‌కు కేటాయించిన మూడు మెరైన్ బోట్లు ఐదేళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంధన ఖర్చులు ఇవ్వకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడంతో ఇవి మూలనపడ్డాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా లేకపోవడంతో హార్బర్ విస్తరణ పనుల నేపథ్యంలో రోడ్డు పక్కన వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.