కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది: కేటీఆర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
శాసనసభ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం, పోలీసుల దాష్టీకాన్ని గవర్నర్కు వివరించామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారిందని మండిపడ్డారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడికి వెళ్లారని, మహిళా నేతల పట్ల దుశ్శాసనపర్వానికి తెరలేపారని ఆరోపించారు. ప్రస్తుత అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణించారు.