పవన్ కల్యాణ్ బాలు సినిమా స్టైల్ వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన రేణు దేశాయ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

పవన్ కల్యాణ్ నటించిన 'బాలు' సినిమా షూటింగ్ సమయంలో ఆయన కోసం విదేశాల్ లో బట్టలు కొనుగోలు చేసినట్లు నటి రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న ఆమె, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్ లూజ్ జీన్స్, విదేశీ షాపింగ్ అనుభవాలను పంచుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కాకుండా స్టైలిస్ట్ గా మాత్రమే తాను పనిచేశానని, షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ చేసినట్టే తాను కూడా ఇష్టంతో బట్టలు ఎంపిక చేశానని ఆమె వెల్లడించారు.