సాగునీటి రంగానికి అంకితమై రైతులకు అండగా నిలుస్తానన్న ఈఈ వెంకటస్వామి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

జగదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఎర్రోళ్ల వెంకట్స్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఈఈ వెంకట్స్వామి మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రైతులకు సకాలంలో నీరందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.