మడ్డువలస జలాశయం ఐదు గేట్లు ఎత్తివేతతో దిగువకు వరద నీరు

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 5 గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈఈ అర్జున్ తెలిపారు. వేగావతి, సువర్ణముఖీ నదుల ద్వారా 14,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని, జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 65 మీటర్లకు గాను ప్రస్తుతం 64.37 మీటర్లకు చేరుకుందని అధికారులు స్పష్టం చేశారు.