పిడుగురాయి గ్రామంలో బ్రిడ్జిపైకి చేరిన కాలువ నీరు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పిడుగురాయి గ్రామంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కాలువ నీరు బ్రిడ్జిపైకి చేరింది. ఈ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు, వాహనదారులు బ్రిడ్జిపై ప్రయాణించవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. స్థానిక పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.