నగరిలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి ఇంటి స్థల పట్టాలను అందించారు. అదేవిధంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమైంది.