బెల్లంపల్లి బంగారు మైసమ్మ ఆలయంలో కన్నులపండువగా మహా చండీయాగం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో శుక్రవారం మహా చండీయాగం, హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రేణికుంట్ల ప్రవీణ్, కౌన్సిలర్లు డి. కొండ పద్మ, చింతల వసంత, దావ రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, నాయకులు నెల్లి రమేష్, దామర శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.