మహిళల సంక్షేమ పథకాల వైఫల్యంపై ఆలేరులో వంటవార్పు నిరసన
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది మహిళలతో 'వంట-వార్పు' నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, కేసీఆర్ కిట్ వంటి పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహిళలతో కలిసి స్వయంగా వంట చేసి నిరసన తెలిపారు. అనంతరం మహిళలనుద్దేశించి ప్రసంగించి, హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.